జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహరాణులు వైఎస్సార్ చేయూత ద్వారా ఆత్మ గౌరవం పెంచారు పిల్లలను చదివించే తల్లులకు నగదు ప్రోత్సాహం ఇస్తున్నాం ఇబ్బందుల్లో, అవసరాల్లో అండగా ఉంటున్న ప్రభుత్వం మనదే మర్చి యార్డు కూలీలకు అండగా ఉంటాం మహిళలకు ఏం కావాలన్నా మరింత మేలు చేయడానికి జగనన్న సిద్ధం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు
1.
జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహరాణులు
వైఎస్సార్ చేయూత ద్వారా ఆత్మ గౌరవం పెంచారు
పిల్లలను చదివించే తల్లులకు నగదు ప్రోత్సాహం ఇస్తున్నాం
ఇబ్బందుల్లో, అవసరాల్లో అండగా ఉంటున్న ప్రభుత్వం మనదే
మర్చి యార్డు కూలీలకు అండగా ఉంటాం
మహిళలకు ఏం కావాలన్నా మరింత మేలు చేయడానికి జగనన్న సిద్ధం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు
మహిళలకు అన్నివిధాలా అండగా ఉంటూ వారిని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళుతున్న గొప్ప ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. నరసరావుపేట రహదారిలోని కారం మిల్లులకు సంబంధించి ఎండు మిరప కాయల తొడాలు ఒలిచే కూలీలను మంత్రి విడదల రజిని శుక్రవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. వారితో కలిసి కూర్చుని కొద్దిసేపు తొడాలు ఒలిచారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయా.. అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా..? అని మహిళలను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ మహిళల ఆత్మ గౌరవం పెంచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పిల్లలను చదివిచంకునే పేద తల్లులకు జగనన్న ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్నారని చెప్పారు. మన ఇబ్బందుల్లో, మన అవసరాల్లో మనకు పూర్తిగా అండగా ఉంటున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని తెలిపారు. మహిళలకు ఏం కావాలన్నా ఇంకా మరింతగా సంక్షేమాన్ని అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.