బస్సులో సీటు కోసం ఈసారి చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్మి లు  


బస్సులో సీటు కోసం ఈసారి చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్మి లు  

 సిద్దిపేట జిల్లా


మ‌హిళ‌లు సాధార‌ణంగా నీటి కుళాయిలా వ‌ద్దనో, లేక నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల తేడా వ‌ద్ద‌నో లొల్లిల్లు పెట్టుకోవ‌డం చూశాం. కానీ బ‌స్సులో ఫ్రీ జ‌ర్నీ తెచ్చిన తంట‌తో సీటు కోసం లొల్లి పెట్టుకుంటున్నారు.

ముందు సీట్ల కోసం జుట్టు పట్టుకున్నారు, మొన్న బట్టలు చింపుకున్నారు.. ఇప్పుడు జరిగింది అంతకు మించిందే అని చెప్పాలి. సీటు కోసం చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.
   
ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో గురువారం సాయంత్రం  చోటుచేసుకుంది. ఇది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బస్సు సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది. ముందు మాటా మాటా పెరిగింది.. ఆతరువాత ఆ గొడవ కాస్త కాళ్ల చొప్పులు తీసుకునే పరిస్థితి వచ్చింది