పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం? వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాల్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.