సొంతింటి కలను నెరవేర్చాం గుంటూరులోని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ ఫారాలు అందజేస్తున్నాం జగననన్న ప్రధమ ప్రాధాన్యం మహిళలే 32 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీతో చరిత్ర సృష్టించాం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని 31, 29, 44 డివిజన్లలోని సచివాలయాల పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ
1.
సొంతింటి కలను నెరవేర్చాం
గుంటూరులోని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు
పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ ఫారాలు అందజేస్తున్నాం
జగననన్న ప్రధమ ప్రాధాన్యం మహిళలే
32 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీతో చరిత్ర సృష్టించాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
31, 29, 44 డివిజన్లలోని సచివాలయాల పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ
సొంతింటి కలను నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరులోని 31, 29,44 డివిజన్లలో శుక్రవారం నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న స్థంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి హక్కులు నిరుపేదలకే దక్కేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. జగనన్న ప్రధమ ప్రాధాన్యం మహిళలేనన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఏకంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చేపట్టిన తొలి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేసే విషయంలో తమ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని విధంగా పనిచేసిందని తెలిపారు. ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనలో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని వివరించారు. గతంలో ఇంటి స్థలం రావాలంటే సవాలక్ష కష్టాలు ఉంటాయని, ఇప్పుడు సొంత ఊరిలోనే ఉన్న సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలని వివరించారు. అర్హులైతే కేవలం 90 రోజుల్లోనే ఇంటి స్థలం అందజేస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి ప్రభుత్వాలు అరుదుగా వస్తుంటాయని తెలిపారు. మరోసారి తమకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేవలం ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా వాటిని రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరించి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇస్తున్నదని తెలిపారు. ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టామన్నారు. తొలి విడత 15 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికి దాదాపు 7.50 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. మహిళలకు సొంత స్థలం, సొంత ఇంటి రూపంలో ఒక పెద్ద ఆస్తిని ప్రభుత్వం చేకూరుస్తోందని చెప్పారు. మహిళలకు తమ పేరు మీద ఇల్లు ఉండడంతో వారికి ఒక భరోసాను ఇచ్చినట్టవుతుందన్నారు. ఒక అన్నగా జగనన్న రాష్ట్రంలో ఆడపడుచులకు ఇస్తున్న బహుమానం ఇదని మంత్రి రజిని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలంతా జగనన్నకు అండగా నిలవబోతున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా పలువురు మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి వెంట ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, ఆయా క్లస్టర్ల ఇన్‌చార్జిలు, మండల అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, సచివాలయ కన్వీలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..