ప్రభుత్వ ఆసుపత్రికి వరాల జల్లు కురిపించిన  వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ   

1.

ప్రభుత్వ ఆసుపత్రికి వరాల జల్లు కురిపించిన  వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ   


సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏం టి కృష్ణబాబు వరాల జల్లులు కురిపించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం సూపరింటెండెంట్ ఛాంబర్ లో ఎంటి కృష్ణ బాబు ఆసుపత్రి అభివృద్ధి  పనుల గురించి సమీక్ష చేసారు. ఆసుపత్రి అభివృద్ధి పనుల గురించి పలు ప్రతిపాదనలు చీఫ్ సెక్రటరీ కి  డాక్టర్ కిరణ్ కుమార్ వివరించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ 2018 లో నిలిచిపోయిన సర్వీస్ బ్లాక్ నిర్మాణం గురించి వివరించగానే వెంటనే ఏపీ ఎంయస్ ఐ డి సి ఎండి మురళీధర్ రెడ్డి తో మాట్లాడి దానికి సంబంధించిన ఫైల్ ను పంపించాలని కోరినట్లు ఆయన చెప్పారు. భవనం నిర్మాణం వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఈ సర్వీస్ బ్లాక్ నిర్మాణం పూర్తి అయితే లాండ్రీ, వంటశాల, ఫార్మసీ స్టోర్ , నాలుగు కోట్ల తో కొత్తగా సిటీ స్కాన్  ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అయన వివరించారు. కాకుమాను వారి తోట ఆరు ఎకరాల స్థలాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు అయన తెలిపారు. దీనికి సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణానికి ఇంజనీరింగ్ శాఖ ఈ ఈ శ్రీధర్ తో చర్చించారని ఆయన చెప్పారు. వెంటనే ఈ ఫైల్ కు సంబందించిన పనులను పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారని ఆయన తెలిపారు. సి ఎఫ్ యమ్ యస్ లో ఆగిపోయిన 42 లక్షల రూపాయలను , కాన్పుల వార్డు లో ఆగిపోయిన లిఫ్ట్ మరమ్మతుల కు సంబందించిన బడ్జెట్ ను కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల అయిదారు నెలల నుంచి ఆగిపోయిన సిటీ స్కాన్ కూడా త్వరలోనే అందుబాటులో కి వచ్చేందుకు మార్గం సుగమం ఏర్పడిందని అయన చెప్పారు. పొదిల ప్రసాద్ బ్లాక్ లోని రెండు అంతస్థుల భవనం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన చెప్పారు. 

ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ ఆసుపత్రి కి 1800 అడుగులు స్థలం కేటాయించారని అందులో వంద పడకలను ఏర్పాటు చేసుకునేందుకు  యమ్ ఓ యూ   ఒప్పంద పత్రాన్ని యమ్ టి కృష్ణ బాబు చేతులమీదుగా నాట్కో సమన్వయ కర్త వై అశోక్ కుమార్ అందుకున్నారు. 
ఈ స్థలం లో ఉన్న లాండ్రీ తో పాటు పలు విభాగాలను సర్వీస్ బ్లాక్ లోకి మారుస్తున్నట్లు డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. సర్వీస్ బ్లాక్ లోకి మార్చడానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయనున్నట్లు  అయన చెప్పారు.