గుంటూరులో పలువురికి అనారోగ్య సమస్యలపై మంత్రి రజిని గారు సమీక్ష
1.
గుంటూరులో పలువురికి అనారోగ్య సమస్యలపై మంత్రి రజిని గారు సమీక్ష
గుంటూరు నగరంలో పలువురికి వాంతులు, విరేచినాలు వంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు ఆదేశాలు జారీచేశారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఆదివారం అధికారులతో మంత్రి విడదల రజిని గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలకు గల కారణాలను అన్వేషిస్తున్నామన్నారు. మంచినీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపామని చెప్పారు. పరిస్థితి అదుపులోనేఉందని తెలిపారు. అయినాసరే అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మేయర్ కావటి శివనాగమనోహర్‌నాయుడు గారు, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి గారు, కమిషనర్ కీర్తి చేకూరి గారు, డీఎంహెచ్‌వో, ఆర్డీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.