టీడీపీ కి మ‌రోసారి భంగపాటు త‌ప్ప‌దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త విడదల రజిని స్పష్టం చేశారు

1.

టీడీపీ కి మ‌రోసారి భంగపాటు త‌ప్ప‌దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త విడదల రజిని స్పష్టం చేశారు.చంద్ర‌బాబు ఎన్ని కుట్ర‌లు కుతంత్రాలు చేసిన... విజయం మాత్రం వైసిపి నే వరిస్తుందన్నారు.చ‌రిత్రలో లిఖించబడేలా జ‌గ‌న‌న్న పాలన సాగుతోందన్నారు.గుంటూరు 28వ డివిజ‌న్‌లో మ‌నతో మన ర‌జిన‌మ్మ కార్య‌క్ర‌మం శనివారం రాత్రి పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ అట్టహాసంగా జరిగింది.సీత‌మ్మ కాల‌నీ..అంకమ్మ తల్లి గుడి దగ్గరి నుంచి సాగిన ఈ కార్యక్రమానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లిన మంత్రికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా విడుదల రజనికి తమ ఆశీస్సులు అందిస్తామన్నారు.ఈసందర్భంగా రజిని మాట్లాడుతూ జ‌గ‌న‌న్న నాయ‌క‌త్వంలో గుంటూరును గొప్ప న‌గ‌రంగా మారుస్తామన్నారు.నవరత్నాల కార్యక్రమంతో అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగుల నింపామని వివరించారు.ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక కార్పొరేట‌ర్ పడాల సుబ్బారెడ్డి, వైసిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.