గుంటూరు నగరానికి ప్రధానంగా మంచినీరు సరఫరా చేయు తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ నందు పర్యటించిన గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు.

1.

గుంటూరు నగరానికి ప్రధానంగా మంచినీరు సరఫరా చేయు తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ నందు పర్యటించి,క్లియర్ వాటర్ సంప్,ఫిల్టర్ బెడ్స్,ఏరియేటర్స్,ఆలం ట్యాంక్,క్లారిప్లోక్లేటర్స్,క్లోరిన్ మిక్సింగ్ ప్లాంట్ల యందు పర్యటించి,వాటర్ ఫిల్టరేషన్ పరిశీలించి,తదుపరి ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై గుంటూరు నగరంలోని ELSR(రిజర్వాయర్లు)ను యుద్ధ ప్రాతిపదికన బుధవారం సాయంత్రానికి శుభ్రం చేయుటకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తున్న గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు.
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ,


????త్రాగునీటి సరఫరా పై ఎటువంటి ఫిర్యాదు రాకూడదని,త్రాగునీటిపై ఫిర్యాదులు ఏమైనా అందినట్లయితే,వెంటనే స్పందించి సదరు సమస్యను పరిష్కరించాలన్నారు.
????త్రాగునీటి సరఫరాపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో,నగరంలోని రిజర్వాయర్లను యుద్ద ప్రాతిపదికన శుభ్రం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
????రిజర్వాయర్లను శుభ్రం చేయడానికి అవసరమైన వస్తు సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని,బుధవారం ఉదయం ప్రారంభించి,సాయంత్రానికి రిజర్వాయర్ల క్లీనింగ్ పూర్తి కావాలన్నారు.
????ప్రజలకు త్రాగునీటి సరఫరా సరఫరా చేసే ముందే క్లోరిన్ సమపాళ్లలో ఉన్నదీ లేనిదే విరివిగా తనిఖీ చేయాలన్నారు.
????హెడ్ వాటర్ లో క్లీనింగ్ అనంతరం క్లోరిన్ తనిఖీ చేసినప్పటికీ,రిజర్వాయర్లలో కూడా తప్పనిసరిగా క్లోరిన్ తనిఖీ చేయాలన్నారు.
????రిజర్వాయర్ నుండి గృహాలకు త్రాగునీటి సరఫరా చేయు సమయంలో ఎమినిటీ సెక్రటరీలు టైలండ్ పాయింట్ వరకు వాటర్ శాంపిల్స్ సేకరించాలన్నారు.
????త్రాగునీటి శాంపిల్స్ సేకరించిన అనంతరం,క్లోరిన్ తాలూకు రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో EE లు సుందర రామిరెడ్డి, కొండారెడ్డి,J.శ్రీనివాసరావు,DEE లు,AE లు, ఇతర ఇంజనీర్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.