ప్రభుత్వ ఆసుపత్రి కి జాతీయ స్థాయి లో మానసిక వైద్య విభాగ పిజి వైద్య విద్యార్థులకు ప్రధమ బహుమతులు రావడం గర్వకారణమని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు
1.
ప్రభుత్వ ఆసుపత్రి కి జాతీయ స్థాయి లో మానసిక వైద్య విభాగ పిజి వైద్య విద్యార్థులకు ప్రధమ బహుమతులు రావడం గర్వకారణమని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. పూణే లో జరిగిన జాతీయ మానసిక చికిత్స విభాగ పిజి సదస్సు లో ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్య విభాగం పిజి వైద్య విద్యార్థులు కాత్యాయనీ, విష్ణు నాయర్ సత్తా చాటారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ వారిని అభినందించా
రు.
పిజి వైద్య విద్యార్థులు పరిశోధన చేసే విషయం లో సహకారం అందిస్తామని డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. పాఠశాల విద్యార్థుల్లో డిజిటల్ అడిక్షన్ పై చేసిన పరిశోధన కు ఉత్తమ పేపర్ విభాగం లో ప్రధమ బహుమతి పొందారని ఆయన అన్నారు. అదేవిధంగా బిపి వల్ల వచ్చే మెదడు కు సంబంధించిన వ్యాధి కి సంబంధించి మానసిక లక్షణాలు పై ఉత్తమ పోస్టర్ బహుమతిని సాధించడం సంతోషకరమని ఆయన అన్నారు. పిజి లను సలహాలు సూచనలు అందించిన మానసిక వైద్య విభాగం హెచ్ ఓ డి డాక్టర్ ఉమాజ్యోతి , అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట కిరణ్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి కిరణ్ ను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ నిమిషా, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ రమ్య పాల్గొన్నారు.