వైసీపీ ప్ర‌భుత్వంలోనే ఉద్యోగుల‌కు గుర్తింపు

Minister Vidadala Rajini said that 108 employees are playing a vital role in the society

వైసీపీ ప్ర‌భుత్వంలోనే ఉద్యోగుల‌కు గుర్తింపు

మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ 108 ఉద్యోగులు స‌మాజంలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించే విష‌యంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్ప‌ద‌ని చెప్పారు. జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంలో ఉద్యోగుల‌కు ఏ క‌ష్టం రాకుండా చూసుకుంటున్నామ‌ని తెలిపారు. 104, 108 ఉద్యోగుల‌కు అండ‌గా ఉంటామ‌ని, ఏ స‌మ‌స్య లున్న మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు.108 ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్య‌క్షుడు బి.కిర‌ణ్‌కుమార్‌, సంఘ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ఎన్. మ‌హేష్‌, సంఘం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ ఆర్‌.శ్రీనివాస‌రావు, 104 ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్య‌క్షుడు వి.ఫ‌ణికుమార్‌, ఉపాధ్య‌క్షుడు రాంబాబు, అర‌బిందో సంస్థ నుంచి ప్రాజెక్టు మేనేజ‌ర్ ఎంవీ స‌త్య‌నారాయ‌ణ‌, జోన‌ల్ మేనేజ‌ర్ రాకేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.