రిపబ్లిక్ డే రోజు ఘోర రోడ్డు ప్రమాదం

రిపబ్లిక్ డే రోజు ఘోర రోడ్డు ప్రమాదం
 వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు మృతి
చిలకలూరిపేట నరసరావుపేట మధ్య ఉన్న కావూరు లింగుంట్ల గ్రామం చెక్కపోస్టు వద్ద వ్యవసాయ కూలీలు ఉన్న ఆటో నో ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. మాచర్ల నుంచి చిలకలూరిపేట వస్తున్న ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న వ్యవసాయ కూలీలతో ఉన్న ఆటోను ఢీకొనడం జరిగింది. ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. బస్సు కూడా రోడ్డు మీద నుంచి పొలాల్లోకి పల్టీ కొట్టింది. ప్రమాదంలో వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగినది. విషయం తెలుసుకున్న  రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి తెలియాల్సి ఉంది.