పేదల పెన్నిధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, తమ పార్టీ ద్వారానే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు తెలిపారు
1.
పేదల పెన్నిధి వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ అని, తమ పార్టీ ద్వారానే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు తెలిపారు.గుంటూరు 22వ డివిజన్‌కు చెందిన దాదాపు 40 కుటుంబాలు బుధవారం తెలుగుదేశంపార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. స్థానిక చంద్రమౌళి నగర్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ నాయకుడు గేదెల రమేష్ ,షేక్ బాజీ(ట్రాన్స్‌పోర్టు), తంగిరాల మార్కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.పార్టీలో చేరిన వారిలో షేక్ మున్ని, షేక్ నీలూ, షేక్ సిరాజున్నీసా, షేక్ ఫాతిమూన్, షేక్ నూర్జహాన్, షేక్ నీలోఫర్, షేక్ పర్వీన్ సుల్తానా, షేక్ పర్వీన్, పఠాన్ గౌసియా, షేక్ గౌసియా బేగం, షేక్ మాబున్నీ, ఎం.సామ్రాజ్యలక్ష్మి, షేక్ బీబీ జాన్, ఈశ్వరమ్మ, జి.వెంకటేశ్వరమ్మ, పఠాన్ మున్ని, షేక్ దుర్గ, షేక్ బుజ్జి, షేక్ సైదమ్మ తదితరులు ఉన్నారు