భారతీయులందరి పండుగ ఈ గణతంత్ర దినోత్సవం.
భారతీయులందరి పండుగ ఈ గణతంత్ర దినోత్సవం.
నేడు 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు జాతీయ జెండాను ఎగురవేశారు.
భారతీయులందరూ సమానత్వం తో జీవించాలని, కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగ ను రచించిన మహానుభావుల ఆశయ సాధనకు కృషి చేస్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారని తెలిపారు. ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం లో కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని, ఆనాడు మహానుభావులు కలలు కన్న గ్రామ స్వరాజ్యం ను నేడు జగనన్న గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గుమ్మంముందుకే తీసుకొస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు తెలిపారు.