క్లాస్‌లో పాఠం వింటూ గుండెపోటుతో మృతి చెందిన విద్యార్థి.

క్లాస్‌లో పాఠం వింటూ గుండెపోటుతో మృతి చెందిన విద్యార్థి.. 

క్లాస్‌లో పాఠాలు వింటున్న విద్యార్థి తరగతి గదిలోనే గుండెపోటుతో మృతి చెందిన ఘటన  తరగతి గదిలో విద్యార్థి కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్ధమవుతున్న రాజా అనే యువకుడు.. భవార్కువాలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఎప్పటిలాగే రాజా కోచింగ్ సెంటర్‌కి వచ్చి క్లాస్‌రూమ్‌లో కూర్చుని పాఠం వింటున్నాడు. అయితే అకస్మాత్తుగా తరగతి గదిలో స్పృహతప్పి పడిపోయాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారటంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజా (18) మరణించిన విద్యార్థి.. ఉన్నత చదువుల కోసం ఇండోర్‌లో స్థిరపడ్డాడు. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న రాజా గురువారం ఉదయం ఇండోర్‌లో కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యాడు. ఈక్రమంలోనే అతను గుండెపోటుతో మరణించాడు.