చేనేత కల్యాణ మండపం, చేనేత విద్యార్థుల వసతి గృహ నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు హామీ ఇచ్చారు.

1.

చేనేత కల్యాణ మండపం, చేనేత విద్యార్థుల వసతి గృహ నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గారు హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం నగరంలోని గుజ్జనగుండ్ల లో నిర్మాణంలో ఉన్న చేనేత కళ్యాణ మండపం, చేనేత విద్యార్థుల వసతి గృహాలను సందర్శించారు. సమావేశానికి వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కన్న మాస్టారు గారు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి, చేనేత సంఘ నాయకులు గోలి వెంకటేశ్వర రావు, గుర్రం చిన వీరయ్య, కోట సత్యం, సూరేపల్లి ఈశ్వర రావు, మాచర్ల వీర రాఘవయ్య, చిన్నం వెంకట సుబ్బారావు, కారంపూడి వాసుదేవరావు, డాక్టర్ పులిపాటి కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు..!!