కొండవీడుకు కొత్త వెలుగు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రతిష్ట నాకు లభించిన గొప్ప వరం కొండవీడును గొప్ప పర్యాటకప్రాంతంగా నిలబెట్టాము నాలుగేళ్లలో ఏకంగా రూ.15 కోట్లతో కొండవీడులో నగరవనం అభివృద్ధి రెండో దశ ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఏకంగా రూ.11 కోట్లు ఖర్చు చేశాం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రతిష్ట
1.
కొండవీడుకు కొత్త వెలుగు
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రతిష్ట నాకు లభించిన గొప్ప వరం
కొండవీడును గొప్ప పర్యాటకప్రాంతంగా నిలబెట్టాము
నాలుగేళ్లలో ఏకంగా రూ.15 కోట్లతో కొండవీడులో నగరవనం అభివృద్ధి
రెండో దశ ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఏకంగా రూ.11 కోట్లు ఖర్చు చేశాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రతిష్ట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కొండవీడుకు కొత్త వెలుగు తీసుకురాగలిగామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. యడ్లపాడు మండలం కొండవీడు కొండపై గురువారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురాతన, దేవాదాయ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండవీడులో ఎంతో ప్రతిష్టాత్మకంగా లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. తన చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం జరగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఏకంగా 35 అడుగుల ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించామని తెలిపారు. పూర్ణాహుతి, ధృవ దేవతా కల్యాణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించామని చెప్పారు. ఆలయ నిర్మాణాన్ని పురావస్తు, దేవాదాయశాఖలు సంయుక్తంగా చేపట్టాయని వెల్లడించారు. ఆలయా నిర్మాణానికి మొత్తం ఏకంగా రూ.76 లక్షల వరకు ఖర్చే చేశామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయించుకుని కొండవీడును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోగలిగామని చెప్పారు. కొండవీడు అభివృద్ధి కోసం తాను అటవీ, పురావస్తు, దేవాదాయ, పర్యాటక, రోడ్లు, భవనాలు శాఖ... ఇలా అన్ని శాఖల నుంచి నిధులు మంజూరుచేయించుకోవడంలో విజయవంతం అయ్యానని తెలిపారు. ఫలితంగా కొండవీడులో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగామని వెల్లడించారు. చిల్డ్రన్స్ పార్కు, పార్కింగ్ ఏరియా, ఓపెన్ ఎయిర్ థియేటర్, చెరువుల అభివృద్ధి, ఘాట్ రోడ్ల నిర్మాణం, వ్యూ పాయింట్లు, చరిత్ర ఉట్టిపడేలా ప్రవేశ ద్వారం, విద్యుద్దీకరణ, ఆలయాల నిర్మాణం.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కొండవీడులో చేపట్టామని వివరించారు..!!