గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు  జరిగిన "75వ గణతంత్ర దినోత్సవ వేడుక

1.

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు  జరిగిన "75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో" గౌరవ అతిథిగా హాజరైన ఉమ్మడి గుంటూరు జిల్లాల జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా గారు.
     ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ జె. మోహన్ రావు గారు జెండా ఆవిష్కరించి,గౌరవ వందనం స్వీకరించారు, డి.పి.ఓ శ్రీమతి శ్రీదేవి గారు, ఎకౌంట్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసరావు గారు,జిల్లా పరిషత్ కార్యాలయం పరిపాలనా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
     ఈ కార్యక్రమంలో గౌరవ జెడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా గారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సమరయోధులు నివాళులు అర్పించారు,అనంతరం భారత దేశం మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చింది, ఇప్పుడు మనకు

వున్న వున్న ప్రతి అవకాశం ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం అని కొనియాడారు, ఇంత మంచి చేసిన మన దేశానికి మనము ఏం చేసాము అనేది ఎప్పుడు గుర్తు చేసుకోవాలని, మనం ఎప్పుడూ ప్రజలకు మన చుట్టుపక్కల ఉన్నవారితో సమాధానంగా మంచిగా మెలగాలని, ప్రతి ఒక్కరికీ ప్రేమ తో మెలగాలి అని తెలియజేశారు.అనంతరం ఈ సంవత్సరం ప్రతిభ కనబరిచి ఉత్తమ అధికారులుగా ప్రతిభా పురస్కారాలు లభించిన జిల్లా పరిషత్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం నందు ప్రతిభ కనబరిచిన వివిధ ఉద్యోగులకు కూడా జిల్లా పరిషత్ తరుపున ప్రతిభా పురస్కారాలు చైర్ పర్సన్ క్రిస్టినా గారు మరియు సీఈవో జె. మోహన్ రావు గారు అందించారు.
       జెడ్పీ సీఈవో జె. మోహన్ రావు గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతిభ కనబరిచి ఉత్తమ అధికారులుగా ప్రతిభా పురస్కారాలు లభించిన జిల్లా పరిషత్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం ఉత్తమ అధికారుల జాబితాలో జెడ్పీ సీఈవో శ్రీ జె . మోహన్ రావు గారు కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.