గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు సమన్వయకర్త నూరిఫాతిమా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
1.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు సమన్వయకర్త నూరిఫాతిమా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు. అలాగే..
రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని తెలిపారు.
స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం.
ఆ పవిత్ర గ్రంథ రూపకర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవార్థం
పలు కార్యక్రమాలు నిర్వహించమని. ఇందులో భాగంగా విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశమని వెల్లడించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు’ తెలియజేశారు.
అనంతరం తూర్పు నియోజకవర్గంలోని 23డివిజన్లలో యువనేత బషీర్ నేతృత్వంలో YSRCP సిటీ యూత్ ప్రెసిడెంట్ సూరజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్స్ , డైరెక్టర్లు, కార్పోరేటర్లు, వార్డు ,క్లస్టర్ఇంచార్జ్లు , పాల్గొన్నారు.