జగనన్న ప్రభుత్వం వచ్చినాక " గ్రామం నుంచి జిల్లా వరకు " జిల్లా నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు,
1.
గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసాయని జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు,
జగనన్న ప్రభుత్వం వచ్చినాక " గ్రామం నుంచి జిల్లా వరకు " జిల్లా నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు,
ఎమ్మెల్యే ముస్తఫా మరియు సమన్వయకర్త నూరిఫాతిమా.
సోమవారం తూర్పు నియోజకవర్గంలోని
8వార్డు
పాత గుంటూరు నందివెలుగు రోడ్డుకు 3కోట్ల వ్యయంతో ఆధునీకరణ అభివృద్ధి పనులకు
శంకుస్థాపన చేశారు,
ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ
తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో
దూసుకుపోతుందని తెలిపారు.
గత ప్రభుత్వాలు కమిషన్స్ కు కక్కుర్తి పడి అడ్డదిడ్డంగా తవ్వి వదిలేసిన రోడ్లను తమ ప్రభుత్వంలో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు,
ఈ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇస్తున్నారు ఎవరు నమ్మొద్దని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర్ కమిషనర్ కీర్తీ చేకూరి " నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు .
వైసీపీ కార్పోరేటర్లు , వార్డు ఇన్చార్జులు వార్డ్ ప్రెసిడెంట్లు , వివిధ శాఖల చైర్మన్లు డైరెక్టర్లు , మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు