రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వ ఆసుపత్రి లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 

1.

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వ ఆసుపత్రి లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 

గొంతు నొప్పి తో బాధ పడుతుండటం తో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రి ఈ ఎన్ టి విభాగానికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.

 ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ నేతృత్వం లో ఈ వైద్య పరీక్షలు జరిగాయి. ఈ సందర్బంగా అంబటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు దీటు గా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి లో మెరుగైన వైద్యం జరుగుతుందని నమ్మకం తో ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. గొంతు నొప్పి ఉండటం వల్ల ఈఎన్టి ఓ పి కి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైద్య, విద్య ఫలాలు ప్రతి పేదవారికి అందాలన్న నిశ్చయం తో ఉన్నారని ఆయన చెప్పారు. 
ఈ ఆసుపత్రి లో అందుతున్న వైద్య సేవల పై ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో వైద్యులు, వైద్య సిబ్బంది, వైసీపీ నేతలు సోములు, అనిల్ పాల్గొన్నారు.