ప్రభుత్వ ఆసుపత్రి లో నెఫ్రాలజీ వార్డు లో కిడ్నీ రోగులకు నిరంతరం వైద్యుల పర్యవేక్షణ లో వైద్య సేవలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. శుక్రవారం డయాలసిస్ వార్డు ను ఆయన పరిశీలించారు.
1.
ప్రభుత్వ ఆసుపత్రి లో నెఫ్రాలజీ వార్డు లో కిడ్నీ రోగులకు నిరంతరం వైద్యుల పర్యవేక్షణ లో వైద్య సేవలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. శుక్రవారం డయాలసిస్ వార్డు ను ఆయన పరిశీలించారు. వార్డులో నెలకున్న అపరిశుభ్రత పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన సూచించారు. పనికిరాని వస్తువులను సూపరింటెండెంట్ దగ్గరుండి బయటకు తీసి వేయించారు. నాట్కో అధినేత నన్నపనేని వెంకయ్య చౌదరి నెఫ్రాలజీ వార్డును ఎంతో అందంగా తీర్చి దిద్ది రోగులకు అందుబాటులో తీసుకుని వస్తే సిబ్బంది మాత్రం వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వైద్యు
లు అద్భుతంగా రోగులకు సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు.
నెఫ్రాలజీ వార్డు లో రక్తాన్ని శుద్ధి చేసే అయిదు (డయాలసిస్) పరికరాలను అందుబాటులో ఉంచామని అందుకు అవసరమైన రోగులకు డ యాలసీస్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అవసరాన్ని బట్టి గాస్ట్రో ఎంట్రారాలజి తో పాటు మిగతా విభాగాల వైద్యులు కూడా వైద్య సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు.
రోగులకు వైద్యం అందించే విషయం లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు వైద్యులను అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. నెఫ్రోప్లస్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనీసం వారి వార్డులో ఆక్సిజన్ , వెంటిలేటర్ లు అందుబాటులో ఉండటం లేదన్నారు. అక్కడ ఉన్న రోగులను నెఫ్రాలజీ వార్డులోనైనా షిఫ్ట్ చేయమని ఆదేశించిన పట్టించుకోలేదని ఆయన అన్నారు. లూజు మోషన్స్ ఉన్న రోగులకు నెఫ్రాలజీ వార్డులో వైద్య సేవలు అందిస్తున్నామని అయన చెప్పారు.
బంధువులను పలకరిస్తూ... ఆసుపత్రి లో లూజు మోషన్స్ తో బాధపడుతున్న రోగులను సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను, బంధువులను పలకరించినట్టు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆరోగ్యం గురించి అయన అరా తీశారు. ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పగానే వెంటనే ఆసుపత్రి సిబ్బందిని అలెర్ట్ చేసారు. ప్రతి పడక పై ఉన్న రోగులను అయన ఆరోగ్య క్షేమాల గురించి తెలుసుకుంటూ వైద్యులను అప్రమత్తం చేసారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ యమ ఓ డాక్టర్ సతీష్ కుమార్, నెఫ్రాలజీ హెచ్ ఓ డి డాక్టర్ శివరామకృష్ణ , నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశ సజని పాల్గొన్నారు.