ఆడపడుచుల కు అన్న గా పండుగ కనుక
1.
*ఆడపడుచులకు అన్న గా పండుగ కానుక*
వినుకొండ నియోజకవర్గం లోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్న గా చిరు కానుక అందిస్తున్నామని *శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు* తెలియజేశారు.
*జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని ప్రతి ఒక్క అక్కాచెల్లెమ్మలకు పండుగ కానుక ను అందించటమే ప్రధాన ఉద్దేశం అని శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు తెలిపారు.*
బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట,వెల్లటూరు, గ్రామాల్లో ఆడపడచులకు సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం లో శాసనసభ్యులు వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ, సంవత్సరం లో తొలి పండుగ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి అడపడుచుకు తాను అన్న గా భావించి పండుగకు కానుక గా చీర పంపిణీ చేయటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పండుగ అందరూ ఎంతో సాంప్రదాయ పద్ధతిలో జరుకుంటారని, రైతులందరికీ ఈ పండుగ ప్రధానమైనదని, అన్నారు. ఆ భగవంతుడి చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ముందుగా అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.