ఎన్టీఆర్ జిల్లా - మైలవరం మైలవరంలో ఉద్రిక్తత మైలవరం చిన్న చెరువు వద్ద రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ...

ఎన్టీఆర్ జిల్లా - మైలవరం

మైలవరంలో ఉద్రిక్తత

మైలవరం చిన్న చెరువు వద్ద రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ...

 గత ప్రభుత్వ హయాంలో ఈ స్థలాన్ని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన ప్రభుత్వ అధికారులు..


(బీసీ(వడ్డెర), ఎస్సీ(మాదిగ)ల మధ్య చిచ్చు రాజేసిన చెరువు పోరంబోకు భూమి వివాదం.

చర్చి ప్రక్కన జాతీయ రహదారికి అనుకుని ఉన్న చెరువు పోరంబోకు భూమి తమదంటే తమదంటూ గత కొంతకాలంగా రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం.

చర్చి ప్రక్కనే చినహరిజనవాడ కు చెందిన దళితులు చేపట్టిన నిర్మాణాన్ని అడ్డుకున్న బీసీ(వడ్డెర) వర్గం,ఆ భూమి తమదంటూ వాగ్వాదం.

చర్చి 30సంవత్సరాల నుండి ఉంది కాబట్టి ప్రక్కనున్న భూమి కూడా తమదేనంటూ బీసీలతో వాగ్వాదానికి దిగిన ఎస్సీలు.

వాగ్వాదం పెరిగి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు.

విషయం తెలియడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.

ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు, పరిస్థితిని అదుపులోకి తెచ్చిన వైనం.

ఘర్షణలో పలువురికి గాయాలు,మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

స్థలం వద్ద పోలీస్ బందోబస్త్, వివాదం పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.