పానీపూరి తింటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త

పానీపూరి తింటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త

పానీపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి

 అపరిశుభ్ర పానీపూరి వల్ల 
శుభ్రత లేని పని పూరి బడ్లు,మురికి కాల్వల పక్కన  తోపుడు  బండ్లు తో లొట్టలు వేసుకుంటూ తింటూ ఫుడ్ పాయిజన్ గురవుతున్నారు. ఈ సంఘటన ఏలూరు(D) జంగారెడ్డిగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పానీపూరి తిన్న ఇద్దరు సోదరులు వెలపాటి రామకృష్ణ(10), విజయ్ (6) వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. వారి మృతికి ఫుడ్ పాయిజనే కారణమని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు నంద్యాల నుంచి జంగారెడ్డిగూడెంకు వలస వచ్చారు.