ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు
1.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం 53వ డివిజన్ వెంగళ్ రావు నగర్ ఉన్న ప్రభుత్వ బాలకొన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను అందచేశారు తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ...
అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబర్చాలనే ఉ
ద్దేశంతో ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.
ఏడాది రూ.620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్ లను అందించనున్నట్లు తెలిపారు.
ఈ ట్యాబ్ లలో రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ ను ప్రిలోడెడ్ గా ఇస్తున్నామని, ట్యాబ్ ధర రూ.17,500 తో కలిపి ప్రతీ విద్యార్థికి రూ.33 వేల మేర లబ్ది కలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుపాటి వంశీ, వైసీపీ నాయకులు అలా కిరణ్, చిదార్ల రాజేష్ మెహబూబ్ ,రవిరాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.