చెత్త కుప్పలో శిశువు
1.
చెత్త కుప్పలో శిశువు
నాగర్‌కర్నూల్:జనవరి 13
నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలం తాళ్లపల్లిలో అమానవీయ ఘటన శనివారం చోటు చేసుకుంది.
అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు. శిశువు ఏడుపును గమనించిన స్థానికులు.. తక్షణమే పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు.
ప్రాణాలతో ఉన్న మగ శిశువును పోలీసులు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు న్నారు.