గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ పోస్టల్ కాలనీలో కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి, లూకారాణి,వసుంధర,ఝాన్సీల ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన వంద మంది టీడీపీకి చెందిన వారు వైఎస్సార్ సీపీలో చేరారు.పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి స్వాగతం పలికిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు
1.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ పోస్టల్ కాలనీలో కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి, లూకారాణి,వసుంధర,ఝాన్సీల ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన వంద మంది టీడీపీకి చెందిన వారు వైఎస్సార్ సీపీలో చేరారు.పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి స్వాగతం పలికిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు..
నవరత్నాలు నవశకానికి నాంది సీఎం వై.ఎస్.జగనన్న తన పరిపాలనలో మహిళలకు అందించిన నవరత్నాలు నవశకానికి నాంది పలికాయని మంత్రి రజిని గారు చెప్పారు.మహిళలకు అగ్రతాంబూలాన్ని ఇచ్చి అన్ని విధాలుగా,అండగా నిలిచి వారిలో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతోందన్నారు. వైఎస్సార్ సీపీకి పూర్తి స్థాయిలో మహిళా లోకం అండగా ఉందని స్పష్టం చేశారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం సీఎం జగన్ననకు,తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు..
జీడీసీసీ బ్యాంకు చైర్మన్ లాలుపురం రాము,వైఎస్సార్సీపీ నేతలు రంగారెడ్డి, సత్య,శంకర్,ప్రసన్నకుమార్,గౌరీశం కర్,వేణు,శివప్రసాద్, నూతనపాటి వెంకటేశ్వర్లు,సుబ్బు,రమేష్ పాల్గొన్నారు