బడుగు, బలహీనవర్గాల వారందరినీ కంటికిరెప్పలా చూసుకునే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు...
1.
కంటికి రెప్పలా చూసుకునే నాయకుడు జగనన్న
బడుగు, బలహీనవర్గాలే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి బలం
మీరు ముందుండి నన్ను నడిపించండి
గడిచిన రెండు ఎన్నికల్లో ఓటమికి కారణాలు వెతకాలి
సమస్య ఎక్కడ ఉందో చూడాలి
వాటిని పరిష్కరించుకుని ముందుకు కదలాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలను ఎప్పటికీ వేరు చేయలేరు
ఎస్సీల ఆత్మ గౌవరవం కాపాడే నాయకుడు జగనన్న
చిలకలూరిపేట యార్డు చరిత్రలో తొలిసారి ఒక ఎస్సీకి చైర్మన్ పదవి ఇచ్చాం
పట్టణ ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేశాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
పార్టీ ఎస్సీ సెల్ తో ప్రత్యేక సమావేశం
బడుగు, బలహీనవర్గాల వారందరినీ కంటికిరెప్పలా చూసుకునే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు చంద్రమౌళినగర్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగంతో మంత్రి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని గర్వంగా చెప్పుకునేలా పరిపాలన సాగిస్తున్న సీఎం జగనన్న అని
చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలను ఎప్పటికీ, ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా బడుగు, బలహీనవర్గాల వారు ఆర్థికంగా ఎదిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికి కనీస అవసరాలైన ఇళ్లు, మంచి విద్య, మంచి వైద్యం.. ఇవన్నీ ఉచితంగా అందేలా చేస్తున్న గొప్ప ప్రభుత్వం తమది అని చెప్పారు. రాష్ట్రంలోని పేదలంతా ఎలాంటి భయాందోళనలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా సంతోషంగా ఈ రోజు జీవిస్తున్నారని, అందుకు తమ ప్రభుత్వ విధానాలే కారణమని వివరించారు.
వచ్చే ఎన్నికల్లో పశ్చిమలో గెలుపే మన లక్ష్యం కావాలి
గడిచిన రెండు ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయిందని మంత్రి తెలిపారు. అందుకు గల కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. లోపాలను సరిచేసుకుని, సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కలిసి పనిచేస్తే గెలుపు సులువు అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి చూపాల్సిన అవసరం ఉందన్నారు. గెలుపు కోసం తాను చేయాల్సిందంతా చేస్తానని, నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల వారందరికీ మరింత మేలు చేకూరుతుందని వెల్లడించారు.
చిలకలూరిపేటలో ఎస్సీలకు అందలం
చిలకలూరిపేట నియోజకవర్గ చరిత్రలో తొలిసారి ఒక బీసీ మహిళనైన తనను పోటీలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి విడదల రజిని తెలిపారు. ఒక బీసీ మహిళగా తాను పోటీ చేస్తే.. బీసీలు, ఎస్సీలు అంతా తామే పోటీ చేసినట్లుగా భావించి కష్టపడి పనిచేసి గెలిపించారని గుర్తుచేసుకున్నారు. వారి కష్టాన్ని వృథా కానీయరాదనే లక్ష్యంతో తాను పనిచేశానన్నారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డు చరిత్రలో తొలి సారి ఎస్సీలను చైర్మన్ చేశామని తెలిపారు. వరుసగా రెండు సార్లు ఇద్దరు ఎస్సీలను మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కూర్చోబెట్టామంటే అది జగనన్న పరిపాలనా సంస్కరణల వల్లనే సాధ్యమైందని వెల్లడించారు. గుంటూరులోనూ బీసీలు, ఎస్సీలు గొప్పగా తలెత్తుకుని తిరిగేలా పనిచేస్తానన్నారు. చిలకలూరిపేట పట్టణం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటుచేసి బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేశామన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితులు పశ్చిమ నియోజకవర్గంలోనూ వచ్చేలా చేస్తానని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు రాతంశెట్టి సీతారామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ బత్తుల దేవానంద్, కార్పొరేటర్లు బోడపాటి ఉషారాణి కిషోర్, అందుగుల సంతోష్, గురవయ్య. ఈచంపాటి వెంకటకృష్ణాచారి, గేదెల రమేష్ గారు, మార్కెట్ బాబు గారు, యోగేశ్వరరావు, ఐటీ విభాగ అధ్యక్షుడు మాదాస్ కిరణ్, మహిళా విభాగ అధ్యక్షురాలు గనికపాటి ఝాన్సీ, యార్డ్ డైరెక్టర్ ప్రభు, ఎస్సీ నాయకులు అత్తోట జోసెఫ్, స్టాలిన్, క్లస్టర్ ఇంఛార్జీలు బందా రవీంద్రనాథ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి గారు, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.