నందిగామ మున్సిపల్ కమిషనర్ గా డాక్టర్ జయరాం గారి పనితీరు ప్రశంసనీయం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

1.

నందిగామ మున్సిపల్ కమిషనర్ గా డాక్టర్ జయరాం గారి పనితీరు ప్రశంసనీయం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

మంచి చేసిన వారిని.. అభివృద్ధి చేసిన వారిని.. ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

వృత్తిపట్ల విశ్వాసం, నిబద్ధతతో పని చేసిన ఉద్యోగికి గుర్తింపు, గౌరవం లభిస్తాయి : కమిషనర్ డాక్టర్ జయరాం ..

నందిగామ పట్టణంలోని శ్రీకరం ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి బదిలీపై వెళ్తున్న డాక్టర్ యస్.జయరాం గారి వీడ్కోలు సభ.. నూతన కమిషనర్ గా నియమితులైన కె. హేమమాలిని గారి ఆహ్వాన మరియు సన్మాన సభలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ ఉద్యోగమైనా.. సేవ అయినా.. రాజకీయ రంగమైనా.. మంచి చేసిన వారిని, అభివృద్ధి చేసిన వారిని ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారని తెలిపారు. మున్సిపాలిటీలో ఉద్యోగులంతా కలిసికట్టుగా.. పట్టుదల, నిబద్ధతతో పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి అనడానికి నందిగామ పురపాలక సంఘమే ఉదాహరణ అని చెప్పారు. సమాజంలో విలువలు, నైతికత దిగజారిపోతున్న రోజుల్లో.. అర్థరహితమైన విమర్శలను ఎదుర్కొంటూ.. వ్యక్తిగత దూషణలను తట్టుకుంటూ.. ముందుకు సాగడమనేది ప్రయాసంగా మారిందని వివరించారు. మంచి చేద్దామని పనిచేస్తున్నా.. కొంతమంది దురుద్దేశం పూర్వకంగా అడ్డుపడుతున్నారని.. మంచి పనులను, అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలి అని కొంతమంది ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతున్నారని వారందరిని సమాజం గమనిస్తుందన్నారు. నందిగామ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి చేయాలనే మా ఆలోచనలకు అనుగుణంగా.. దార్శనీకతతో, వేగవంతంతో పనిచేసిన కమిషనర్ డాక్టర్ జయరాం గారి పనితీరు ప్రశంసనీయమని కొనియాడారు ..