రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జగనన్న ఆరోగ్య సురక్ష తొలి, రెండో విడత కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా పేర్కొన్నారు
1.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
చేపట్టిన "జగనన్న ఆరోగ్య సురక్ష తొలి, రెండో విడత కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని
53వ,6వ డివిజన్లలో ఉన్న 35వ సచివాలయం UPHC నందు మరియు వెంగళ్ రావు నగర్ 154 సచివాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేదవాడికి వైద్యాన్ని చేరువ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు.
కార్పొరేట్ వైద్యాన్ని పేదల ఇంటి ముంగిట పెట్టిన పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుని సీఎం పీఠం పై కూర్చోపెట్టేందుకు రాష్ట్ర ప్రజలు కృషి చేయాలని కోరారు.
గత ప్రభుత్వాలు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ కార్పొరేటర్ దుపాటి వంశీ, వైసీపీ ముఖ్య నాయకులు దుపాటి సాల్మన్, అనిల్ ,మహేష్,రవిరాజ్
6 వార్డు ఇంచార్జ్ జఫర్ ఖాన్ వైసీపీ ముఖ్య నాయకులు , జీలని, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.