మొగులూరు గ్రామంలో "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమంలో నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
1.
మొగులూరు గ్రామంలో "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమంలో నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పేదలకు 'మేలు' పర్వతంలా జగనన్న సంక్షేమ పథకాలు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఉనికి కోసమే చంద్రబాబు పొత్తుల కోసం పాకులాట : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల మండలంలోని మొగులూరు గ్రామంలో బుధవారం ఉదయం "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు -లబ్ధిదారులకు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాలకు జగనన్న సంక్షేమ పథకాలు మేలు పర్వతంలా వరాలు ప్రసాదిస్తున్నాయన్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరింత పెంచుకున్నారని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులకు వ్యతిరేకమని, ఒంటరిగా పోటీ చేయడమే తమ విధానమని తెలిపారు. ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలే ఇవ్వటం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయటం.. నిత్యం జనంతో మమేకమవడం.. ప్రజలకు మధ్య చేయడం.. మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని ప్రజలను కోరడమే.. సీఎం జగన్ సిద్ధాంతమని వెల్లడించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసే చంద్రబాబు ను ప్రజలు నమ్మరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మళ్లీ వైయస్ జగన్ సీఎం కావడం తధ్యమని, ప్రజలకు మరింత మేలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ..