ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
మంగళవారం పొదిల ప్రసాద్ బ్లాక్ లోని రెండో బ్లడ్ బాంక్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఉదయ్ ఆసుపత్రి అధినేత డాక్టర్ రామకృష్ణ రెడ్డి రెండు లక్షల రూపాయల ఖరీదు గల రక్త పరీక్ష ఫలితాలు చూపించే రెండు పరికరాలను బ్లడ్ బాంక్ కు అందచేశారు. ఈ పరికరాలను డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రామకృష్ణ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రక్తం లోని ప్లాస్మాను, రక్త కణలను వేరు చేసే సెంట్రి ఫ్యూస్, బ్లడ్ బ్యాగ్ సీల్ పరికరాలు రెండు లక్షల వ్యయం ను డాక్టర్ రామకృష్ణ రెడ్డి అందించారని ఆయన చెప్పారు. ఈ ఆసుపత్రి లో రెండో బ్లడ్ బాంక్ ను ఏర్పాటు చేసి ఆపరేషన్ దియేటర్ ల కు అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. గతం లో బ్లడ్ బాంక్ కు వెళ్లాలంటె కష్ట తరంగా ఉండేదని ప్రస్తుతం కోత్తగా ఆధునికరించిన 40 లక్షల వ్యయంతో నిర్మించి రెండు ఆపరేషన్ దియేటర్ ల వద్ద బ్లడ్ బాంక్ ను ఏర్పాటు చేయడం వల్ల ఎంతో వేసలు బాటు కలుగిందని ఆయన చెప్పారు.
డాక్టర్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కళాశాలలో చదివానని చెప్పారు. తన వంతు సహాయంగా ఈ పరికరాలను అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ గోవిందా నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎ సురేష్, సివిల్ సర్జన్ ఆర్ ఎం ఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశ సజని పాల్గొన్నారు.