ప్రభుత్వ ఆసుపత్రి లోని కానూరి జింకాన మాత శిశు సంరక్షణ కేంద్రం ను జింకాన బోర్డు బృందం మంగళ వారం పరిశీలించరు.
1.
కానూరి జింకాన ఏంసి హెచ్ సెంటర్ ను సందర్శించిన
బోర్డు సభ్యులు
ఏడాది లోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు
ఆసుపత్రి నిర్మాణ పనులపై సంతృప్తి
ప్రభుత్వ ఆసుపత్రి లోని కానూరి జింకాన మాత శిశు సంరక్షణ కేంద్రం ను జింకాన బోర్డు బృందం మంగళ వారం పరిశీలించింది.
ఆసుపత్రి లో జరుగుతున్న ఎంసి హెచ్ నిర్మాణ పనుల పై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఏంసిహెచ్ ను ఎప్పటి లోగా పూర్తి చేస్తారు.. నాణ్యత విషయం లో రాజీవపడవద్దని సూచించింది.
ముందుగా ఈ బృందం సభ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ను కలుసుకుని పనుల పై సమీక్షించారు.
అనంతరం కానూరి జింకాన ఏం సి హెచ్ ను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కానూరి జింకాన ఏం సి హెచ్ నిర్మాణం అద్భుతమైన కట్టడమని అన్నారు. ఇలాంటి ఆసుపత్రి సౌత్ ఇండియా లోనే ఉండదని అయన అన్నారు. ప్రభుత్వ రంగం లో వంద కోట్ల తో ఏం సి హెచ్ నిర్మాణం జరుగుతుందని అయన అన్నారు. ఇప్పటికే ఆరు ఫ్లోర్ లు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అయన సంతోషం వ్యక్తం చేసారు. జింకాన చేసిన సహాయం ఎవరు మర్చి పోలేరని దానికి వెల కట్టలేమని
ఆయన అన్నారు. పేద ప్రజల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నభూతో న భవిష్యత్ చందంగా తీర్చి దిద్దుతున్నారని అయన కొనియాడారు